ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అది ఒక బూటకపు ఎన్​కౌంటర్.. కైలాసం పేరుతో ఆడియో విడుదల - Visakha Division Secretary Kailasam audio released news update

డిసెంబర్ 13న ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దు సింగారంలో జరిగిన ఎన్​కౌంటర్ బూటకపు ఎన్​కౌంటర్ అని పేర్కొంటూ విశాఖ (ఎంకేవీ) డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో ఓ ఆడియో విడుదల చేశారు. ఇందులో... అమరులైన మల్లేష్, శాంతమ్మలకు విప్లవాభినందనలు తెలిపారు. మరో ఇద్దరిని తమ వెంట తీసుకువెళ్లినట్లు తమ వద్ద సమాచారం ఉందన్న ఆయన... వారిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

Audio released on encounter
కైలాసం పేరుమీద ఆడియో విడుదల

By

Published : Dec 15, 2020, 12:22 PM IST

ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దు సింగారంలో జరిగిన ఎన్​కౌంటర్ బూటకపు ఎన్​కౌంటర్​ అంటూ మల్కనగిరి కోరాపుట్ - విశాఖ (ఎంకేవీ) డివిజన్ కార్యదర్శి కైలాసం పేర్కొన్నారు. ఈమేరకు ఆడియో రికార్డును విడుదల చేశారు. కటాఫ్ అటవీ ప్రాంతంలో సేదతీరుతూ ఉండగా ఒడిశా బీఎస్​ఎఫ్​ బలగాలు ఏకపక్షంగా కాల్పులు జరిపారని ఆడియోలో ఆరోపించారు. ఈ ఘటనలో మల్లేష్, శాంతమ్మ ఇద్దరు అమరులయ్యారన్నారు. మరో ఇద్దరిని తమ వెంట తీసుకువెళ్లినట్లు తమ వద్ద సమాచారం ఉందన్న ఆయన వారిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా ప్రజల మౌలిక సమస్యలపై పోరాడుతున్న తమపై జరిపిన కాల్పులను అందరూ ఖండించాలని కోరారు.

కాల్పుల్లో మృతి చెందిన మల్లేష్ గత 18 ఏళ్లుగా విశేష సేవలందిస్తూ గుమ్మాదళ సభ్యునిగా ఎదిగారని గుర్తుచేశారు. అలాగే శాంతమ్మ ఆరు నెలలుగా దళంలో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. నవంబర్​లో జంత్రీ కటాప్ ప్రాంతంలో నీటిలో పడిపోయిన తమ సభ్యుడిని బయటకు తీసి చంపారని గుర్తు చేశారు. పోలీసులు ఏకపక్షంగా చేస్తున్న బూటకపు ఎన్​కౌంటర్​లను మేధావులు ప్రజలు ఖండించాలని కైలాసం ఆడియో వాయిస్​లో చెప్పారు. పోలీసులు బందీలుగా తీసుకువెళ్లిన ఇద్దర్ని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details