రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు... విశాఖ జిల్లాలో అమలవుతున్న విధానాన్ని కలెక్టర్ వినయ్‌చంద్ వివరించారు. నివాస యోగ్యమైన ఒకటిన్నర సెంట్ల ఇళ్ల స్థలాలను పేదలకు ఇచ్చేవిధంగా కసరత్తు జరుగుతోందని తెలిపారు. గతంలో జరిగిన భూ అక్రమాల నివేదికపై సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం పరిశీలిస్తోందన్నారు. అవినీతి రహితంగా రెవెన్యూ శాఖనే కాకుండా, అన్ని శాఖలను తయారు చేసేందుకు... పారదర్శక పాలన ఒక్కటే సమాధానమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక ప్రక్రియ సజావుగా సాగేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు.
సంక్షేమ పథకాల లక్ష్యాలను అందిపుచ్చుకుంటాం: కలెక్టర్ - విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్
విశాఖ జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని...కలెక్టర్ వినయ్‌చంద్ వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్