సబ్బవరం మండలం గోల్లేపల్లి గ్రామ సచివాలయంలో జిల్లా సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తనిఖీలు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని సదుపాయాలు సచివాలయం నుంచి పొందే వీలున్నప్పుడు... ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. గొల్లేపల్లి, మల్లినాయుడుపాలెం లబ్దిదారులకు ఒకే ట్యాగ్ పెట్టడం వల్ల ఎవరికీ ప్రయోజనం పొందుతున్నారో గుర్తించడం కష్ట అవుతుందని వేర్వేరుగా పెట్టాలని సూచించారు.
గ్రామస్థులతో జేసీ మాట్లాడారు. జిల్లాలో ఉన్న 2.9 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో అర్హుల జాబితా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హులై.. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని సూచించారు. వీరికి 90 రోజుల్లోగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని జేసీ పేర్కొన్నారు.