విశాఖ రావికమతం మండలం చలిసింగం గ్రామ గిరిజనులు శనివారం కొత్తకోటలో ధర్నాకు దిగారు. మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన బాలింత... చలిసింగం నుంచి కొత్తకోట డోలి మోతపై తీసుకొచ్చే ప్రయత్నంలో మృతి చెందింది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి తమను విముక్తి చేయాలని కోరారు. తమ గ్రామానికి సరైన రహదారి కల్పించేలా పాలకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
'ఇంకెన్నాళ్లీ డోలి మోతలు... విముక్తిని కలిగించండి' - విశాఖ జిల్లా చలిసింగిం గిరిజనుల నిరసన
గిరిజనులకు వైద్యం అందటం గగనమైందని... ఈ క్రమంలో డోలిమోతలపై రోగులను తీసుకువచ్చే దుస్థితి నుంచి తమకు విముక్తి కలిగించాలని చలిసింగం గ్రామ గిరిజనులు నిరసన చేశారు. మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన బాలింత సకాలంలో వైద్యం సకాలంలో అందక మృతి చెందింది.
కొత్తకోటలో చలిసింగం గ్రామ గిరిజనుల నిరసన