విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం అయితంపూడి గ్రామానికి వెళ్లే రోడ్డు ఆధ్వానస్థితిలో ఉంది. గ్రామస్థులు పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, హామీలే తప్ప ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రహదారి దమ్ము చేసిన వరిపొలంగా తయారైంది. దీంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు రహదారిపై వరినాట్లు నాటి నిరసన తెలిపారు. కె.పి.అగ్రహారం నుంచి అయితంపూడికి వెళ్లే రెండు కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
రహదారిపై వరినాట్లు... వినూత్న రీతిలో నిరసన - విశాఖ జిల్లా వార్తలు
"ఒకటా!..రెండా మేము పుట్టినప్పటి నుంచి మా ఊరికెళ్లే దారి బాగుపడలేదు. పైగా వర్షం కురిస్తే గోతుల్లో వర్షం నీరు, బురద. ఎన్నాళ్లు ఈ ఇబ్బందులు" అంటూ ఆ గ్రామ యువకులు వినూత్న రీతిలో నిరసన చేశారు. గ్రామానికి వెళ్లే రహదారిపై వరినాట్లు వేశారు. అధికారులు స్పందించి గ్రామానికి రోడ్డు వేయాలని కోరారు.
రహదారిపై వరినాట్లు... వినూత్న రీతిలో నిరసన