ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎవరికీ భయపడకండి.. నచ్చిన వ్యక్తిని ఎన్నుకోండి' - కొయ్యూరులో పంచాయతీ ఎన్నికలు వార్తలు

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు అన్నారు. జిల్లాలోని మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతమైన కొయ్యూరు మండ‌లంలోని కంఠారం గ్రామంలో ఆయ‌న ప‌ర్య‌టించారు.

visakha dig vistied koyyuru
కొయ్యూరులో విశాఖ రేంజ్ డీఐజీ పర్యటన

By

Published : Feb 5, 2021, 12:30 PM IST

ప్రలోభాలకు తలొగ్గకుండా, ఎవరికీ భయపడకుండా నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాలని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు.. ప్రజలను కోరారు. విశాఖ గ్రామీణ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో క‌లిసి మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతం కొయ్యూరు మండ‌లంలోని కంఠారం గ్రామంలో ఆయ‌న ప‌ర్య‌టించారు.

గ‌తంలో ఓటు హ‌క్కు న‌మోదు కోసం నానా యాత‌న ప‌డాల్సి వ‌చ్చ‌దేని.. ప్ర‌స్తుతం మారిన సాంకేతిక యుగంలో ఓటు న‌మోదు సులువుగా మారింద‌ని అన్నారు. మండ‌లంలోని స‌మ‌స్యాత్మ‌క‌ గ్రామాలపై న‌ర్సీప‌ట్నం ఏఎస్పీ, కొయ్యూరు సీఐతో మాట్లాడారు. మావోయిస్టుల క‌దిల‌క‌లు, ఎన్నిక‌లు సంద‌ర్బంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details