ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ఆన్ లైన్ మోసం గుట్టు రట్టు - విశాఖలో ఆన్ లైన్ మోసం గుట్టు రట్టు

విశాఖలో ఆన్​లైన్ మోసం గుట్టు రట్టయింది. ఆన్​లైన్ మోసాలకి పాల్పడుతున్న నలుగురు నైజీరియన్​లను, ఓ మేఘాలయ మహిళను దిల్లీలో అరెస్టు చేశారు.

visakha cyber crime police arrested nigerians
ఆన్​లైన్ మోసం వివరాలు తెలుపుతున్న పోలీసు కమిషనర్ ఆర్కే మీనా

By

Published : Jan 29, 2020, 3:16 PM IST

ఛారిటీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ పోలీసులు పట్టకున్నారు. ఇండియాలోఛారిటీ కోసం రూ. 39 కోట్లని ఇస్తామంటూ ఓ ముఠా విశాఖ వాసి సంజయ్ సింగ్​కి మెయిల్ పంపింది. ఫేక్ మెయిల్​కి స్పందించి తన వివరాలను బాధితుడు అందించారు. నైజీరియన్ ముఠా వలలో చిక్కుకుని పన్నుల పేరుతో రూ. 6.62 లక్షలను 13 అకౌంట్లలో జమ చేశాడు. ఆ ముఠా స్పందించకపోవడంతో అనుమానంతో విశాఖ పోలీసులను సంప్రదించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నైజీరియన్ ముఠాని, మేఘాలయ రాష్ట్రానికి చెందిన మహిళను దిల్లీలో అరెస్ట్ చేశారు. విశాఖ నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా వివరాలు వెల్లడించారు. నైజీరియన్ ముఠా నుంచి రూ. 55 వేల నగదు, రెండు లాప్​ట్యాప్​లు, ఆరు మొబైల్స్, ఏడు సిమ్​లు, రెండు ఏటీఎంలు, పాస్ పోర్టులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుల బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.1.46 లక్షల నగదు సీజ్ చేసినట్టు చెప్పారు.

విశాఖలో ఆన్ లైన్ మోసం గుట్టు రట్టు

ABOUT THE AUTHOR

...view details