బాధితుల ఫిర్యాదుపై సరిగా స్పందించకుండా తిరిగి వారినే బెదిరించారన్న ఆరోపణలు రుజువైన కారణంగా.. విశాఖ సైబర్ క్రైమ్ సీఐ గోపీనాథ్, ఎస్సై రవికుమార్‌లను నగర సీపీ ఆర్కే మీనా సస్పెండ్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల కారణంగా తాము మరింత కష్టాల్లోకి కూరుకుపోయామన్న బాధితుల ఫిర్యాదులపై విచారణ చేయించిన అనంతరం చర్యలు తీసుకున్నారు.
వివరాలివి
విశాఖ నగరానికి చెందిన ఓ వ్యక్తి.. డేటింగ్ అంతర్జాల చిరునామా నిర్వాహకుల మాటలు నమ్మి రూ.11.60 లక్షలు చెల్లించాడు. ఆ మొత్తాన్ని తిరిగివ్వాలని కోరగా.. రూ.6 లక్షలిస్తేనే పూర్తి సొమ్ము ఇస్తామని సంస్థ యాజమాన్యం మెలిక పెట్టింది. దీనిపై బాధితుడు సైబర్ క్రైంకు ఫిర్యాదు చేయగా.. సీఐ గోపీనాథ్ స్వీకరించలేదు. పైగా డేటింగ్ సంస్థకు డబ్బులెందుకు ఇచ్చావని.. కేసులో ఏ1గా చూపిస్తానంటూ సీఐ బెదిరించారని బాధితుడు ఆరోపించాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
బాధితుని ఫిర్యాదును తీసుకోలేదు