ఈ ఆర్ధిక సంవత్సరానికి 6 వేల 500 కోట్ల రూపాయల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ చలసాని రాఘవేంద్రరావు వెల్లడించారు. విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 105వ మహా జనసభలో ఆయన పాల్గొన్నారు. 1916లో ప్రారంభించిన బ్యాంక్ 104 సంవత్సరాలు పూర్తి చేసుకుని 105వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు.
2019 - 20 నాటికి రూ.5901.54 కోట్ల వ్యాపారం లావాదేవీలు నిర్వహించిందని... అలాగే 87 వేల 863 మంది సభ్యులతో రూ.241.19 కోట్ల షేరు ధనంతో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద అర్బన్ సహకార బ్యాంక్‌గా అవతరించినట్లు చలసాని అన్నారు. కొవిడ్‌తో సంభవించిన ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకొని జూన్ 2020 నాటికి తమ లక్షాలను అధిగమించామని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలో 46 బ్రాంచీలు, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో 4 బ్రాంచీలు కలిగి మొత్తం 50 బ్రాంచీలు, 22 ఏటీఎంలతో బహుళ రాష్ట్రాల సహకార అర్బన్ బ్యాంక్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.