ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పండుగ వేళ కరోనా కట్టడికి కలెక్టర్ దిశానిర్దేశం - పండుగవేళ కరోనా కట్టడికి విశాఖ కలెక్టర్ చర్యలు

పండుగల సమయంలో కొవిడ్ ఉద్ధృతి కట్టడి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజలు అధికంగా సంచరించే వివిధ ప్రాంతాల్లో వైరస్ నివారణను సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భౌతిక దూరం, మాస్క్​లు తప్పకుండా ధరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.

collector review with health officials
వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష

By

Published : Oct 22, 2020, 9:23 AM IST

దసరా, దీపావళి పండుగల సమయంలో.. ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. 'కొవిడ్-19 ఎప్రాప్రియేట్ బిహేవియర్' పేరిట బుధవారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వివిధ దుకాణాల్లో భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్​లు ధరించేలా చూడాలన్నారు. వ్యాపార ప్రదేశాల్లో యజమానులే సొంతగా వైరస్ నివారణపై బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

బస్టాండ్​లు, రైల్వే స్టేషన్​లు, విమానాశ్రయాల్లో విస్తృతంగా కొవిడ్ నివారణపై ప్రచారం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మసీదులు, చర్చ్​లు, దేవాలయాల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని హోర్డింగ్​లన్నీ 10 రోజుల పాటు వైరస్ నివారణ ప్రచారానికే వినియోగించాలని తెలిపారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details