ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో మొదట వారికే కొవిడ్​ వ్యాక్సిన్​: ​విశాఖ కలెక్టర్​ వి.వినయ్​చంద్​

వైద్యసిబ్బంది.. కొవిడ్​ బారిన పడిన వారికి మొదట వ్యాక్సిన్​ డోస్​లు వేస్తామని విశాఖ జిల్లా కలెక్టర్​ వి.వినయ్​చంద్​ వెల్లడించారు. 50 సంవత్సరాలు పైబడిన వారికి.. ఆ తర్వాత బీపీ షుగర్​ , దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వ్యాక్సిన్​​ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు కావాల్సిన కొవిడ్​ వ్యాక్సిన్​ డోస్​లను విశాఖ కేంద్రంగా అందజేయనున్నట్లు జిల్లా పాలనాధికారి వివరించారు.

visakha collector on covid vaccination
విశాఖ కలెక్టర్​ వి.వినయ్​చంద్​

By

Published : Jan 5, 2021, 7:51 PM IST

జిల్లాలో కొవిడ్​ వ్యాక్సిన్​​ డోస్​లను మొదటగా కొవిడ్​ బారిన పడిన వారికి, వైద్య సిబ్బందికి వేస్తామని విశాఖ జిల్లా కలెక్టర్​ వి.వినయ్​చంద్​ తెలిపారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు కావాల్సిన కొవిడ్​ వ్యాక్సిన్​ డోస్​లను భద్రపరిచేందుకు విశాఖలో కోల్డ్ చెయిన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఇందుకోసం అధికార అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. నాలుగు జిల్లాలకు సంబంధించి కొవిడ్​ వ్యాక్సిన్​​ సరాఫరాకు విశాఖ కేంద్రంగా ఉంటుందని జిల్లా పాలనధికారి వెల్లడించారు. 17 లక్షల డోస్​లను నిల్వ చేసే స్టోరేజీ సామర్థ్యం ఉందని అన్నారు.

విశాఖ కలెక్టర్​ వి.వినయ్​చంద్​

మొదటి దశలో 34,767 మందిని అధికారికంగా గుర్తించామని..​ వీరిలో వైద్య సిబ్బందే 18,983 మంది ఉన్నట్లు కలెక్టర్​ పేర్కొన్నారు. కొవిన్​ అనే సాఫ్ట్​వేర్​లో ఇప్పటికే వీరందరి పేర్లు నమోదు చేశామన్నారు. 50 సంవత్సరాలు పైబడిన వారికి.. ఆ తర్వాత బీపీ షుగర్​ , దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వ్యాక్సిన్​ అందజేస్తామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details