ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరిమిత వనరులతో కరోనాను కట్టడి చేసిన విశాఖ' - visakha district collector news

కొవిడ్​ ప్రారంభ రోజుల్లో సమర్థవంతంగా కట్టడి చేసిన పట్టణ ప్రాంతంగా విశాఖను గుర్తించటం సంతోషంగా ఉందని జిల్లా పాలనాధికారి అన్నారు. ఐసీఎంఆర్ - బీఎంజే గ్లోబల్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

visakha district collector
విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్

By

Published : Nov 17, 2020, 8:39 PM IST

కొవిడ్​ వ్యాప్తి తొలినాళ్లలో పరిమిత వనరులతో వైరస్​ను కట్టడి చేసిన పట్టణ ప్రాంత యూనిట్​గా విశాఖను గుర్తించారు. ఐసీఎంఆర్- బీఎంజే అంతర్జాతీయ సంస్థ సంయుక్త సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ విషయాన్ని మెడికల్​ జర్నల్​లో ప్రచురించడంపై విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సంతోషం వ్యక్తం చేశారు.

అందుబాటులో ఉన్న వాటితో కరోనా నియంత్రణ చర్యలు తీసుకున్న తీరు ఆదర్శనీయంగా ఉందని ఈ సర్వే నిర్ధారించిందన్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు విశాఖ అర్బన్ ప్రాంతంలో కొవిడ్ వ్యాప్తిని వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో కట్టడి చేయగలిగామని చెప్పారు. దాదాపు 22 కమిటీలను కొవిడ్ నివారణ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్ర వైద్య కళాశాల చక్కని సహకారం అందించిందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details