విశాఖ జిల్లాలో స్పందన అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్పందన అర్జీలపై అధికారులతో సమీక్షించారు. అర్జీలు పెండింగ్ లేకుండా తక్షణమే పరిష్కరించాలని, అర్జీలకు సమాధానం ఇస్తే ఆన్లైన్లో అప్ లోడ్ చేయాలన్నారు.ఏ శాఖ వద్ద కూడా అర్జీలు పెండింగ్లో ఉంచకూడదని అధికారులను హెచ్చరించారు.త్వరితగతిన వాటి పరిస్థితి తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
' స్పందన' సమస్యలపై విశాఖ కలెక్టర్ సమీక్ష - స్పందన సమస్యలపై విశాక కలెక్టర్ సమీక్ష
స్పందన అర్జీలపై విశాఖ జాయింట్ కలెక్టర్ శివ శంకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ లేకుండా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు
' స్పందన'