ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త ఏడాదిలో విశాఖను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాము - జీవిఎంసీ కమిషనర్

కొత్త సంవత్సరంలో విశాఖను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ సృజన వెల్లడించారు. గడిచిన సంవత్సర కాలంలో కరోనా కారణంగా విశాఖ అనేక సవాళ్లను ఎదుర్కొని నిలిచిందని తెలిపారు.

gvmc  commissioner Srujana
కొత్త ఏడాదిలో విశాఖను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాము

By

Published : Dec 31, 2020, 8:03 PM IST

నూతన సంవత్సవంలో విశాఖను ఆదర్శవంతంగా నిలిపే అనేక ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ సృజన వెల్లడించారు. గత ఏడాది కాలంలో కొవిడ్ మహమ్మారి కారణంగా విశాఖ అనేక సవాళ్లను తట్టుకుని నిలిచిందన్నారు. అనేక ఇంజినీరింగ్ ప్రాజెక్టులపై కొవిడ్ ప్రభావం ఉందని వివరించారు. ప్రస్తుతం పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు. శుద్ధి చేసిన నీటిని తిరిగి వినియోగించడం, మల్టీ లెవల్ కార్ పార్కింగ్ వంటి అంశాలు విశాఖకు ఎంతో పేరు తీసుకువస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details