విశాఖ జిల్లా దేవరాపల్లి కూరగాయల మార్కెట్లో వంకాయకు గిట్టుబాటు ధర లభించక పెద్ద ఎత్తును రోడ్డుపై పారబోశారు. మార్కెట్‌కి పరిసర గ్రామాల నుంచి రైతులు కూరగాయలు తీసుకొచ్చారు. లాక్ డౌన్ ప్రభావంతో వ్యాపారులు పెద్దగా రావడం లేదు. వచ్చిన వ్యాపారులు మూకుమ్మడిగా వంకాయ ధరలు తగ్గించేశారు. దీంతో కిలో వంకాయలకు రూపాయి ధర కూడా లభించలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు వంకాయలను రోడ్డుపై కుప్పలుగా పోసి వెళ్లిపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధర లభించలేదని రైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
వంగ రైతు.. బంగ పాటు - bringle rates in visakha news update
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధర లభించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. లాక్డౌన్ ప్రభావంతో పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం, కిలో వంకాయల ధర రూపాయి కూడా పలకలేదు. దీంతో విశాఖ జిల్లా రైతులు వంకాయలను రోడ్డుపై కుప్పలుగా పారబోశారు.
గిట్టుబాటు ధర రాక వంకాయలు రోడ్డుపై పోసిన రైతులు