ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవో నెంబర్ 21తో ఆటో కార్మికులకు చేటు - జీవో ఎంఎస్ సంఖ్య 21 రద్దుపై నిరసన

ఆటో కార్మికులకు నష్టాన్ని కలిగిస్తున్న జీవో ఎంఎస్ సంఖ్య 21ని వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో విశాఖ ఆటో, రిక్షా కార్మిక సంఘం నగరంలోని సూర్యబాగ్ కూడలిలో ప్లకార్డులతో నిరసన చేపట్టింది.

visakha auto union request to government on go 21
జీవో ఎంఎస్ సంఖ్య 21

By

Published : Oct 24, 2020, 6:17 PM IST

జీవో ఎంఎస్ సంఖ్య 21 ని వెంటనే రద్దు చేయాలని విశాఖ కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని సూర్యబాగ్ కూడలి వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. జీవో 21తో ఆటో కార్మికులకు అనేక సమస్యలు తలెత్తుతాయని విశాఖ ఆటో, రిక్షా కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అప్పల్రాజు అన్నారు. కరోనా ప్రభావంతో ఏడు నెలలుగా కార్మికులు ఉపాధి కోల్పోయారని, ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం కన్నా పొరపాటున జరిగే తప్పిదాలకే ఎక్కువ జరిమానాలు చెల్లిస్తున్నామని తెలిపారు. వెంటనే జీవోను రద్దు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details