ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో.. చాపకింద నీరులా కరోనా! - విశాఖ పట్నం తాజా వార్తలు

విష జ్వరాలతో మంచాన పడే మన్యం ప్రజలపై.. నేడు కరోనా విలయతాండవం చేస్తోంది. చాలా వరకు గ్రామాలు కరోనాతో విలవిల్లాడుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ఆయా గ్రామాలకు వైద్య సేవలు అందడం లేదు.

corona fear in visakha
మన్యంలో కరోనా భయం

By

Published : May 10, 2021, 8:28 PM IST

విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లోని గ్రామాల్లో చాలామంది కోవిడ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా హుకుంపేట మండలం సన్యాసమ్మ పాలెంలో ఇంటింటా కరోనా బాధితులు ఎక్కువయ్యారు. వీరిలో 10 మంది వరకు పాడేరు వైటీసీ క్వారైంటైన్ సెంటర్​లో, కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 20 మంది హోమ్ ఐసోలేషన్​లో ఉన్నారు.

ఈ గ్రామంలో గత ఏడాది కరోనాతో ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు 2 రోజుల్లో ఇద్దరు చనిపోయారు. సుమారు 30 మంది వరకు ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున కొరోనా బారినపడ్డారని గ్రామస్థులు తెలిపారు. తక్షణమే కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు, గిరిజన సంఘం సభ్యులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details