అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి వెళ్ళిన ఏజెన్సీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ను కలిసి జీవో 3 సుప్రీంకోర్టు రద్దు అంశం, ప్రస్తుతం ఏజెన్సీలోని ఆందోళనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జూన్ 18న జరిగే గిరిజన సలహా మండలిలో జీవో 3 రద్దు అంశం.. చట్ట బద్ధతపై తగు సూచనలు ఇవ్వాలని విన్నవించారు. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని... పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకులోయ ఎమ్మెల్యే పాల్గుణ, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, పాలకొండ ఎమ్మెల్యే కళావతిలు కోరారు.
సీఎం జగన్తో ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు భేటీ - విశాఖపట్నం తాజా వార్తలు
అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా విశాఖ ఏజెన్సీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ని కలిశారు. ప్రస్తుతం ఏజెన్సీలో ఉన్న పరిస్థితిలను వివరించారు. జీవో 3 రద్దు అశంపై చర్చించారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరు... సీఎంతో చర్చలు