ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిఘా నేత్రాల ఏర్పాటు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు - సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చెయ్యాలి

విశాఖలోని పరిశ్రమలు, స్కూళ్లు, సినిమా హాళ్లు, గోడౌన్ల వద్ద సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సూచించారు. ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.

police commissioner ordered to arrange cc tv cameras in visakapatnam
నిఘా నేత్రాల ఏర్పాటు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు

By

Published : Feb 9, 2021, 10:51 PM IST

విశాఖలో ఉన్న పరిశ్రమలు తమ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సూచించారు. విశాఖలో కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన పరిశ్రమలు చాలా ఉన్నాయని.. కానీ వాటి పరిసరాల్లో సీసీ టీవీ కెమెరాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ, ప్రవేట్ విద్యా సంస్థలు కూడా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇప్పటికే 25 సంస్థలకు 144 సీఆర్​పీసీ సెక్షన్ల ప్రకారం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. మార్చి 31 లోగా వాణిజ్య కార్యాలయాలు, స్కూళ్లు, సినిమా హాళ్లు, గోడౌన్ల వద్ద సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details