'మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి' - 10th class students
తాము చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలనుకున్నారు పూర్వ విద్యార్థులు. మహనీయుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే విద్యార్థులకు స్పూర్తిదాయకంగా ఉంటుందని భావించారు. ఆలోచన వచ్చిందే ఆలస్యం.. సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
విశాఖ జిల్లాలోని ఖండివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2018-19 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ముత్యాల నాయుడు విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... స్వాతంత్ర సమరయోధుల కృషితో మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామని, ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామని అన్నారు. మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు.