జీవనోపాధి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి కోరారు. కరోనా నేపథ్యంలో మహిళలపై విపరీతంగా హింస పెరిగిందని, ఆయా వర్గాలు ఉపాధికి, ఆదాయానికి దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
'కరోనా సమయంలో మహిళలపై హింస పెరిగింది' - visakha district latest news
కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన మహిళలకు ఆరోగ్య ఆహార భద్రత కల్పించాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. విశాఖ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాలు నిరసన నిర్వహించాయి.
!['కరోనా సమయంలో మహిళలపై హింస పెరిగింది' protest in visakha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:30:16:1598616016-ap-vsp-71-28-women-organisations-demand-food-health-security-av-ap10148-28082020170452-2808f-1598614492-847.jpg)
women protest in visakhapatnam
వైద్యం అందించే ప్రాథమిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడంతో పేద వర్గాలు, మహిళలకు వైద్యం కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణులు కొవిడ్ కారణంగా ఆరోగ్య సమస్యలతో ఇళ్లలోనే ఉండిపోయారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో తిండి లేక మహిళలు పస్తులతో కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.
ఇదీ చదవండీ… 'రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంచితే తెలంగాణకు తీవ్ర నష్టం'
Last Updated : Aug 28, 2020, 6:41 PM IST