విశాఖ జిల్లా చోడవరంలోని విఘ్నేశ్వర ఆలయ ట్రస్టు బోర్డు శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. ట్రస్టు బోర్డు ఛైర్మన్గా నున్న నాగేశ్వరరావు, ట్రస్టీలుగా నీలాచలం వెంకట రమణమూర్తి, సువ్వాడ వెంకట విజయలక్షి, పూసర్ల సుబ్బలక్ష్మి, జ్యోతుల శ్రీనివాసరావు, కొండల గణపతి, కొణతాల విజయలక్ష్మి, మహాలక్ష్మి నాయుడులు శనివారం బాధ్యతలు స్వీకరించారు.
వినాయక ఆలయ ట్రస్టు బోర్డు బాధ్యతలు స్వీకరణ - chodavaram latest news
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ విఘ్నేశ్వర ఆలయ నూతన ట్రస్టు బోర్డు కొలువుదీరింది. ట్రస్టు బోర్డు ఛైర్మన్, ట్రస్టీలు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు.
vinayaka temple in chodavaram trust board takes charges
దేవాదాయ శాఖ ఆస్టిస్టెంట్ కమీషనర్ పి. క్రాంతి వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. చోడవరం స్వయంభూ ఆలయానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చేలా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే ధర్మశ్రీ అన్నారు.