విశాఖ కలెక్టర్‌గా వినయ్ చంద్ బాధ్యతల స్వీకరణ - new collector
విశాఖ నూతన కలెక్టర్‌గా వినయ్ చంద్ బాధ్యతలు స్వీకరించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
విశాఖ జిల్లా కలెక్టర్‌గా వాడ్రేవు వినయ్ చంద్ర ఇవాళ ఉదయం విశాఖ కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టారు. వారి కుటుంబ సభ్యులు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. కె.భాస్కర్ బదిలీ అయినందున ఆయన స్థానంలోకి ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వినయ్ చంద్ర వచ్చారు. గతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా విశాఖ జిల్లాలో సేవలు అందించారు. అంతేకాక తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించిన వినయ్ చంద్ర... ఆ అనుభవంతో విశాఖ నగరంతో పాటు, గిరిజన ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేవిధంగా సహచర సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేస్తామన్నారు. యధావిధిగా సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని చెప్పారు.