విశాఖలోని విమ్స్ ఆస్పత్రిలో కొవిడ్ విభాగంలో సంవత్సర కాలంగా సేవలందిస్తున్న సింహాచలం(25) అనే స్టాఫ్ నర్స్ మరణించాడు. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు.
కొవిడ్‌తో స్టాఫ్ నర్స్ మృతి... అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన - vims hospital latest news
విశాఖలోని విమ్స్ ఆస్పత్రిలో కొవిడ్ రోగులకు సేవలందించిన అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్స్ మృతి చెందాడు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేశారు.
సింహాచలానికి కొవిడ్ సోకి… తాను విధులు నిర్వహించిన చోటే చికిత్స పొందాడు. అతని బంధువులు… అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ..నిన్న మరణించాడు. సింహాచలంపైనే అతని కుటుంబం ఆధారపడి ఉండడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సింహాచలం మరణించటంతో విమ్స్ లోని అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఆర్థిక సహాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులతో మాట్లాడి సింహాచలం కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని విమ్స్ డైరెక్టర్ రాంబాబు హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి:కరోనా మృతురాలి మెడలో బంగారం మాయంపై విచారణ