ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్యాస్ లీక్ భయం... ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలు - విశాఖ గ్యాస్ లీక్ ఘటన

విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలో గ్యాస్ లీక్ సమీప గ్రామాలను భయంలోకి నెట్టేసింది. మళ్లీ ఏదైనా ఉపద్రవం వస్తుందనే భయం బిక్కుబిక్కున గడుపుతున్నారు. మళ్లీ గ్యాస్ లీక్ అయ్యిందన్న వదంతులతో గోపాలపట్నం, సింహాచలం, పెందుర్తి ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు.

villages near vishaka gas leakage spot vacating their house
ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలు

By

Published : May 8, 2020, 7:39 AM IST

విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలో మరోసారి గ్యాస్ లీక్ అయ్యిందన్న వదంతులు రావడంతో గోపాలపట్నం, సింహాచలం, పెందుర్తి ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లారు. రాత్రి పూట దర్ఘటన జరుగుతుందన్న భయంతో దూర ప్రాంతాలకు వెళ్లారు. విశాఖ సీపీ మీనా కుమార్... నాగపూర్ నుంచి బృందం వచ్చిందని, పరిశీలిస్తుందని, ఎటువంటి ప్రమాదం లేదని ధైర్యం చెప్పడంతో తిరిగి వారి ఇళ్లకు చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details