విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరంలో రొయ్యల చెరువుల సాగు పరిశీలించేందుకు వెళ్లిన అధికారులను గ్రామస్థులు ముట్టడించారు. రొయ్యల చెరువుల సాగు కారణంగా జల వనరులు కలుషితమవుతున్నాయని, చర్మ వ్యాధులు వస్తున్నాయంటూ అధికారులకు తెలిపారు. తమ గోడును ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. తక్షణమే చెరువులు తొలగించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే కదలనిచ్చేది లేదని అధికారుల కారుకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. తహసీల్దార్ రొయ్యల చెరువుల యజమానులను పిలిచి నివేదిక వచ్చేవరకు సాగు నిలుపుదల చేయాలని సూచించారు.
రాజానగరంలో అధికారులను అడ్డగించిన గ్రామస్థులు
పాయకరావుపేట మండలం రాజానగరంలో రొయ్యల చెరువుల సాగు పరిశీలించేందుకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. రొయ్యల సాగు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ గ్రామస్థులు అధికారులను అడ్డగించారు.
అధికారులను అడ్డగించిన గ్రామస్థులు