లాక్‌డౌన్ నేపథ్యంలో విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ మార్గాల్లో గ్రామాలకు వెళ్లకుండా... రహదారులకు అడ్డుగా చెట్లు, రాళ్లు పేర్చారు. ఫలితంగా నిత్యావసర సరకులు తరలించే వాహనాలు, అంబులెన్సులు, పాలవ్యాన్లు గ్రామాలకు చేరుకోవడం కష్టంగా మారింది. కరోనా కట్టడికి గ్రామస్థులు ముందుకొచ్చినప్పటికీ... ఇటువంటి చర్యలు వద్దని అధికారులు సూచిస్తున్నారు.
రహదారులకు అడ్డుగా రాళ్లు పెట్టిన ప్రజలు - రహదారులపై అడ్డుగా చెట్లు, రాళ్లు పేర్చిన గ్రామస్థులు
పాడేరులో రహదారులకు అడ్డుగా చెట్లు, రాళ్లు పెట్టారు. నిత్యావసర సరకుల రవాణాకు ఇది ఆటంకంగా మారింది. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని అధికారులు ప్రజలను కోరారు.
![రహదారులకు అడ్డుగా రాళ్లు పెట్టిన ప్రజలు villagers-stacked-trees-and-stones-across-the-road-in-vishaka-paderu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6569843-thumbnail-3x2-paderu.jpg)
villagers-stacked-trees-and-stones-across-the-road-in-vishaka-paderu