ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారి నిర్మాణం కోసం.. గ్రామస్థుల ధర్నా - జేపీ. అగ్రహారం

రహదారి పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ జిల్లా రోలుగుంట మండలం జే.పీ. అగ్రహారం గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అధ్వాన్నంగా తయారైన రోడ్డుపై నడవడం సాధ్యం కావడం లేదని వాపోతున్నారు.

రహదారి నిర్మాణం చేపట్టండి.. రోడ్డుపై గ్రామస్థుల ధర్నా

By

Published : Jun 1, 2019, 2:14 PM IST

రహదారి నిర్మాణం చేపట్టండి.. రోడ్డుపై గ్రామస్థుల ధర్నా

రహదారి పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ జిల్లా రోలుగుంట మండలం జే.పీ. అగ్రహారం గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నర్సీపట్నం మండలం సుబ్బారాయుడుపాలెం నుంచి రోలుగుంట మండలం కొమరవోలు మీదుగా జే.పీ. అగ్రహారం వరకు ఉన్న 13 కిలోమీటర్ల రహదారి అధ్వాన్నంగా తయారైంది. దీని మరమ్మతుల కోసం 3 నెలల క్రితం సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ నగరానికి చెందిన గుత్తేదారు టెండర్ పొందాడు. అయితే అతను తారురోడ్డును పెకిలించి అలా వదిలేశాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలినడక సాధ్యపడడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details