ఓ మహిళ మృతదేహాన్ని డోలీలో 6 కిలోమీటర్లు మోసుకెళ్లిన ఘటన.. విశాఖ జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పాడేరు మండలం కాంగుగెడ్డ నుంచి రెండు రోజుల కిందట మూడు నెలల బాలింతకు పక్షవాతానికి గురైంది. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు రహదారి లేకపోవడంతో 6 కిలోమీటర్ల మేర అత్యంత కష్టపడి డోలీలో మోసుకుని, మాడుగుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యవసర చికిత్స నిమిత్తం.. ఆ మహిళను అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
అయితే.. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందింది. అంబులెన్స్‌లో మృతదేహాన్ని రహదారి మార్గం వరకు (CARRIED DEAD BODY IN VISAKHA PATNAM PADERU AGENCY) తీసుకొచ్చారు. ఆక్కడి నుంచి వాహనం ముందుకు కదిలే అవకాశం లేకపోవడంతో.. మృతదేహాన్ని చాపలో చుట్టి, కర్రకు కట్టి అత్యంత కష్టం మీద గ్రామానికి చేర్చారు. రోడ్డులేని కష్టాల దారిలో తమ దుస్థితి నిత్యం ఇలాగే ఉంటోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.