విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని తారురోడ్డులు శిథిలమై.. పెద్ద పెద్ద గుంతలతో అధ్వాన్నంగా మారాయి. మట్టిరోడ్లు పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యాయి. రోడ్లు శిథిలమై ప్రమాదకరంగా ఉన్నా.. తప్పక రాకపోకలు సాగిస్తున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిథిలమైన రోడ్డుపై పడిన గుంతల్లో వర్షపునీరు చేరి మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి. తరచూ.. తారురోడ్డు గుంతల్లో పడి వాహనాలు మొరాయిస్తున్నాయి. అధికారులు స్పందించి తారురోడ్లకు మరమ్మతులు చేపట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
అద్వాన్నంగా రహదారులు...వాహనదారుల ఇబ్బందులు - vishakapatnam latet news
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో గ్రామీణ రహదారులు అద్వాన్నంగా మారాయి. రహదారులపై రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా వాహనాలు రోడ్డు మధ్యలోనే ఆగిపోయి మొరాయిస్తున్నాయి.
అద్వాన్నంగా రహదారులు
ఇదీ చదవండి