గ్రామాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న తరుణంలో.. ప్రజలకు సేవలందించే దిశగా కొందరు అడుగులు వేస్తున్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. గ్రామస్థులందరికీ రెండు వేల మాస్కులను అందించారు.
వాటితోపాటు బీపీ, షుగర్ తదితర వ్యాధుల గుర్తింపు మిషన్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. వీటన్నింటినీ.. సర్పంచ్ వెంకటరావు చేతులమీదుగా గ్రామ ప్రజలకు అందజేశారు. ప్రతి ఒక్కరూ.. మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని చెప్పారు. వైరస్ నియంత్రణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.