విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో నల్ల రాయి క్రషర్లపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కృష్ణాపురంలో సుమారు రూ.25 కోట్ల అక్రమ మైనింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వీవీఆర్ అసోషియేషన్ అధ్వర్యంలో వేరువేరు పేర్లతో 4 క్వారీలను నిర్వహిస్తున్నారని విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులు, సరిహద్దులు,డీజీపీఎస్ సర్వే, ముందుజాగ్రత్త చర్యలు లేవన్నారు. నిబంధనలకు నీళ్లొదిలి.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారన్నారు ప్రతాప్ రెడ్డి అన్నారు.
నల్ల రాయి క్రషర్లపై విజిలెన్స్ దాడులు - illigal mining at krishnapuram mines
విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో నల్ల రాయి క్రషర్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. సుమారు. రూ.25 కోట్ల అక్రమ మైనింగ్ నిర్వహించినట్లు నిర్ధరించారు. విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి.
నల్ల రాయి క్రషర్లపై విజిలెన్స్ దాడులు