ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలయోగి బాలుర గురుకులలో విజిలెన్స్ తనిఖీలు - visakha district

విశాఖ జిల్లా తెనుగుపూడిలోని బాలయోగి బాలుర గురుకుల కళాశాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల మధ్యాహ్నం భోజనంలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు.

Vigilance officers ride on Balayogi gurukulam
బాలయోగి బాలుర గురుకులలో విజిలెన్స్ తనిఖీలు

By

Published : Dec 16, 2020, 10:36 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడిలోని బాలయోగి బాలుర గురుకుల కళాశాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగిన సోదాల్లో స్టోర్ రూమ్, ఇతర సామగ్రిని తనిఖీ చేశారు. విద్యార్థుల మధ్యాహ్నం భోజనంలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపల్ సెలవులో ఉన్నందున త్వరలో పూర్తిస్థాయిలో రికార్డు పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details