కరోనా రోగులకు వినియోగించే టోసిలిజుమాబ్, బురుజు మాబ్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న ముఠాను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఔషధ నియంత్రణ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ప్రసన్న కుమార్, ఎస్.రమ్యకృష్ణ అనే ఇద్దరు వ్యక్తుల టోసిలిజుమాబ్ ఇంజెక్షన్‌ను రూ3 లక్షలకు అమ్మునట్లు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ (విజిలెన్స్) రోగి అటెండెంట్‌గా నటిస్తూ ప్రసన్న కుమార్‌ను సంప్రదించారు. తమ వద్ద టోసిలిజుమాబ్ లేదని, బెవాసిజుమాబ్ ఒక్కో ఇంజక్షన్ 75,000 వేల చొప్పున రెండు ఇంజెక్షన్లకు .1,50,000 అవుతుందని వారు చెప్పారు. రోగి కుమార్తెగా నటిస్తున్న డ్రగ్స్ ఇన్స్పెక్టర్ దీనికి అంగీకరించడంతో.. రమ్య కృష్ణ అనే మహిళ ఫోన్‌లో సంప్రదించి శాంతిపురం వద్ద వేచి ఉండమని చెప్పింది. పథకం ప్రకారం వేచి ఉన్న అధికారులు.. ఇంజక్షన్లను ఇచ్చేందుకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు.ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం 18 (సి) ఉల్లంఘన, లైసెన్స్ లేకుండా వాటిని కలిగి ఉన్నందుకు రెండు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
కరోనా నియంత్రణ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెటింగ్ ముఠా అరెస్ట్ - latest news in vishaka district
కరోనా రోగులకు వినియోగించే టోసిలిజుమాబ్, బురుజు మాబ్ ఇంజెక్షన్లను విశాఖలో బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న ముఠాను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఔషధ నియంత్రణ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
వైద్య ప్రతినిధిగా పనిచేస్తున్న ప్రసన్న కుమార్, అధిక ధరలకు ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయించినందుకు అతనికి సహకరించిన రమ్య కృష్ణపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని అధికారులు తెలిపారు. 49వేల రూపాయలు ఖరీదు కలిగిన ఈ ఇంజక్షన్ ను ఎవరైనా బ్లాక్ మార్కెట్ లో అధిక ధరకు అమ్మాలని ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ..రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు