ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Remdesivir Injections: ఆ ముగ్గురి మృతికి.. గడువు తీరిన ఇంజక్షన్లే కారణమా? - నర్సీపట్నంలో గడువు తీరిన రెమ్​డెసివిర్ ఇచ్చిన వైద్యులు న్యూస్

విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో.. గడువు తీరిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు వినియోగించారంటూ బాధితులు ఆరోపించడం కలకలం రేపింది. ఈ విషయమై.. వైద్య సిబ్బందిని ప్రశ్నిస్తే.. ఇంజక్షన్ ను వినియోగించే పరిస్థితిని బట్టి గడువు పెంచవచ్చుననే మార్గదర్శకాలు ఉన్నాయని వివరించినట్లు బాధితులు తెలిపారు.

గడువు తీరిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఇచ్చారంటూ బాధితుల ఆరోపణ
గడువు తీరిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఇచ్చారంటూ బాధితుల ఆరోపణ

By

Published : Jun 3, 2021, 1:14 PM IST

నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో.. గడువు తీరిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు వినియోగించారంటూ బాధితుల కుటుంబీకులు ఆరోపించారు. ఇంజక్షన్‌పై ఒక తేదీ ఉంటే దానిపై మరో తేదీ ఉన్న స్టిక్కర్‌ను అంటించారని ఆరోపించారు.

ఈ విషయమై వైద్యసిబ్బందిని ప్రశ్నిస్తే.. ఇంజక్షన్‌ను వినియోగించే పరిస్థితినిబట్టి 12 నెలల పాటు వినియోగించే గడువు పెంచవచ్చుననే మార్గదర్శకాలు ఉన్నాయని వివరించినట్లు బాధితులు తెలిపారు. గడువు తీరిన ఇంజక్షన్లు వాడిన రోగుల పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details