ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NAVY HELICOPTER: నేవీ అడ్వాన్స్‌డ్‌ లైట్‌హెలికాప్టర్‌ జాతికి అంకితం - నేవీ అడ్వాన్స్‌డ్‌ లైట్‌హెలికాప్టర్‌

NAVY HELICOPTER: భారత నౌకాదళ వాయు కేంద్రం ‘ఐఎన్‌ఎస్‌ డేగా’లో సోమవారం అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌-324)కు సంబంధించిన తొలి స్క్వాడ్రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి, వైస్‌అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా జాతికి అంకితం చేశారు. దీన్ని అత్యవసర వైద్య సదుపాయానికి ఎయిర్‌ అంబులెన్సుగా వినియోగిస్తారు. కమాండర్‌గా ఎస్‌ఎస్‌ దాస్‌ సేవలు అందించనున్నారు.

NAVY HELICOPTER:
NAVY HELICOPTER

By

Published : Jul 5, 2022, 7:27 AM IST

NAVY HELICOPTER: భారత నౌకాదళ వాయు కేంద్రం ‘ఐఎన్‌ఎస్‌ డేగా’లో సోమవారం అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌-324)కు సంబంధించిన తొలి స్క్వాడ్రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి, వైస్‌అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా జాతికి అంకితం చేశారు. విశాఖలోని ఈ కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ హెలికాప్టర్లను దేశీయంగా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో రూపొందించారు. తూర్పు తీరంలో నిఘాకు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ లోహ విహంగం ఉపయోగపడుతుంది. ఏఎల్‌హెచ్‌ తొలి స్క్వాడ్రన్‌కు ‘క్రెస్ట్రల్స్‌’ అని నామకరణం చేశారు. ‘చిట్టి డేగ’ అని దీని అర్థం. దీన్ని అత్యవసర వైద్య సదుపాయానికి ఎయిర్‌ అంబులెన్సుగా వినియోగిస్తారు. కమాండర్‌గా ఎస్‌ఎస్‌ దాస్‌ సేవలు అందించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details