ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పునౌకాదళం అధిపతిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ - vizag news updates

తూర్పునౌకాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ ఎ.బహదూర్‌సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఈఎన్​సీ అతుల్‌ కుమార్ జైన్‌ దిల్లీకి బదిలీ అయ్యారు. సోమవారం నుంచి బహదూర్‌సింగ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Vice Admiral Ajendra Bahadur Singh has been appointed as the new Commander of the Eastern Fleet
తూర్పు నౌకాదళం కొత్త అధిపతిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్

By

Published : Feb 27, 2021, 10:04 PM IST

తూర్పునౌకాదళం అధిపతిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ నియమితులయ్యారు. అధిపతిగా ఆయన సోమవారం బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం తూర్పు నౌకాదళ ఫ్లాగ్ అఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా ఉన్న అతుల్ కుమార్ జైన్​ దిల్లీలోని సమీకృత రక్షణ సిబ్బంది చీఫ్స్ అఫ్‌ స్టాఫ్ కమిటీ ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టనున్నారు. నావికుల కవాతు, వివిధ యుద్ద నౌకలు, జలాంతర్గాముల సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అతుల్ కుమార్ జైన్ నుంచి బహదూర్ సింగ్ బాధ్యతలు స్వీకరిస్తారు.

ABOUT THE AUTHOR

...view details