ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలి: వెంకయ్యనాయుడు - She is a Change Maker program for women MLAs

Venkaiah Naidu Comments In Gender Responsive Governance Workshop: పార్లమెంటు, శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరిగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ''షీ ఈజ్‌ ఎ ఛేంజ్‌ మేకర్‌'' పేరిట మహిళా శాసనసభ్యుల కోసం నిర్వహించిన మూడు రోజుల సదస్సు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Venkaiah Naidu
వెంకయ్యనాయుడు

By

Published : Feb 7, 2023, 1:44 PM IST

'షీ ఈజ్‌ ఏ ఛేంజ్‌ మేకర్‌' పేరిట మహిళా ఎమ్మెల్యేల కోసం కార్యక్రమం

Venkaiah Naidu Comments In Gender Responsive Governance Workshop: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై.. అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాలని.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇది పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యాన్ని సరిదిద్దడమే కాకుండా, ప్రముఖ నాయకత్వ పాత్రల్లో ఎక్కువ మంది మహిళలు రాణించేట్టుగా చేస్తుందన్నారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేషన్‌ సహకారంతో.. జాతీయ మహిళా కమిషన్‌... ''షీ ఈజ్‌ ఎ ఛేంజ్‌ మేకర్‌'' పేరిట మహిళా శాసనసభ్యుల కోసం నిర్వహించిన మూడు రోజుల సదస్సు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మహిళల సమాన ఉనికి, వారి నాయకత్వం, చట్టసభల్లో వారి భాగస్వామ్యం చాలా కీలకమన్నారు. సాంస్కృతిక, నిర్మాణాత్మక వ్యత్యాసాలను గుర్తించడమే కాకుండా, రాజకీయాలలోకి ప్రవేశించిన మహిళలు గతంలో నాయకత్వం వహించిన వారి నుంచి స్ఫూర్తి పొందాలని కోరారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో.. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, అసోం, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన మహిళా శాసనసభ్యులు పాల్గొన్నారు.

"గతంలో కంటే ప్రస్తుతం రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం బాగా పెరిగింది. కానీ అది సరిపోదు. పార్లమెంటు, శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. చట్టసభల్లో ప్రాతినిధ్యంతోపాటు కుటుంబ ఆస్తుల్లో మహిళలకు సమాన వాటా దక్కేలా చూడాలి. వారికి ఆర్థిక సాధికారతనూ కల్పించాలి". - వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details