టిడ్కో ఇళ్లను నిర్మించి పేదలకు ఇవ్వాలని ఎమ్మెల్యే వెలగపూడి దీక్ష - vishakapatnam latest news
టిడ్కో ద్వారా నిర్మాణం ప్రారంభించిన ఇళ్లను వెంటనే పూర్తి చేసి పేదలకు అందించాలని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నిరసన దీక్ష
టిడ్కో ద్వారా నిర్మాణం చేపట్టిన ఇళ్లను వెంటనే పేదలకు అందించాలని తెదేపా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నిరసన చేపట్టారు. ఎంవీపీ కాలనీలోని తన నివాసం వద్ద కొవిడ్ నిబంధనలు పాటించి నిరసన దీక్ష చేపట్టారు. కోర్టు సాకు చూపి... ఇళ్ల పట్టాలు ఇవ్వటం మానేశారని విమర్శించారు. భారతదేశంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఆలోచన మెుదలుపెట్టింది ఎన్టీఆర్ అని తెలిపారు.