ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కోటి రూపాయల విలువైన వాహనాలు దగ్ధం - కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం

Vehicles burned in Police station: విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్​ పరిధిలో పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలు ఈ ప్రమాదంలో దగ్ధం అయ్యాయి. పోలీస్ స్టేషన్ వెనుక ఖాళీ స్థలంలో పార్క్ చేసిన వాహనాలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదం లో27 బైకులు, 4 కార్లు ఒక ఆటో కాలిపోగా.. వాటి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు.

kanchara palem
కంచరపాలెం

By

Published : Jan 15, 2023, 10:24 PM IST

కంచరపాలెం పోలిస్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం

Vehicles burned in Police station: విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు కంచరపాలెం పోలీస్ స్టేషన్ వెనుక భద్రపరిచారు. ఈ ప్రమాదం లో 27 బైకులు, 4 కార్లు, ఒక ఆటో దగ్ధమయ్యాయి. కాలి పోయిన వాహనాలు విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా ఆకతాయిలు వాహనాలకు నిప్పు పెట్టారా?.. లేక సమీపంలో ఇండస్ట్రియల్ డంపింగ్ యార్డ్​లో వ్యర్ధాల నుంచి మంటలు వ్యాపించి అంటుకున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు స్టేషన్ ప్రాంగణంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజులను పరిశీలిస్తున్నారు. దీనిపై కంచరపాలెం సీఐ ఎస్ విజయ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details