ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నం ఎక్సైజ్ ఆఫీస్: వాహనాల వేలం ఎప్పుడో..? - విశాఖ జిల్లా వార్తలు

విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఎక్సైజ్ కార్యాలయ ప్రాంగణం గందరగోళంగా మారింది. ఏళ్ల తరబడి అద్దె భవనంలో కొనసాగుతున్న ఎక్సైజ్ కార్యాలయంలో... వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు నిండాయి. వేలం వేయకపోవడంతో.. అధికారుల విధి నిర్వహణకు అవస్థలు ఏర్పడ్డాయి.

narsipatam
పేరుకుపోయిన వాహనాలు.. విధినిర్వహణకు అధికారుల అవస్థలు

By

Published : Feb 27, 2021, 3:58 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ కార్యాలయాన్ని నర్సీపట్నం-చింతపల్లి మార్గంలో ఓ అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. దీని పరిధిలో మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం, రోలుగుంట, కోటవురట్ల, కొయ్యూరు తదితర మండలాలు ఉన్నాయి. నర్సీపట్నం ఎక్సైజ్ కార్యాలయంలో పరిధిలో గంజాయి అక్రమ రవాణా, నాటుసారా రవాణాకు సంబంధించి ఏటా కేసులు నమోదు అవుతుంటాయి. ఈ తరహా కేసులతో పట్టుబడిన వాహనాలతో ఎక్సైజ్ కార్యాలయం నిండిపోయింది. 2005 నుంచి ఇప్పటివరకు సుమారు 1050 వాహనాలకు పైగా పట్టుకున్నారు.

వీటిని చట్టప్రకారం వేలం వేయడానికి అనుమతులు అవసరం. ఇక్కడి కార్యాలయం పరిధిలో ఇప్పటికే రెండు దఫాలుగా పాత వాహనాలను వేలం ద్వారా విక్రయించారు. తదుపరి ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానానికి లేఖ రాశామని... ఉత్తర్వులు వచ్చిన వెంటనే మరికొన్ని వాహనాలను వేలం వేస్తామని నర్సీపట్నం సీఐ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. నర్సీపట్నం స్టేషన్​ సొంత భవనం నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు

ABOUT THE AUTHOR

...view details