ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో కూరగాయల అమ్మకాలు ప్రారంభం - vegitables selling in chodavaram

రానున్న కాలంలో చోడవరం వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్ని రకాల వ్యవసాయోత్పత్తుల అమ్మకాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ గూనురు శంకరరావు తెలిపారు. యార్డులో చేపలు, మాంసం అమ్మకాలు చేపట్టినట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.

చోడవరంలో కూరగాయల అమ్మకాలు ప్రారంభం
చోడవరంలో కూరగాయల అమ్మకాలు ప్రారంభం

By

Published : Jun 2, 2020, 11:37 AM IST

విశాఖ జిల్లా చోడవరం వ్యవసాయ మార్కెట్ యార్డులో కూరగాయల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. రైతులు, చిల్లర వర్తకులు కూరగాయలు, ఆకుకూరలను తీసుకొచ్చి అమ్మకాలు చేశారు. రానున్న కాలంలో యార్డులో అన్ని రకాల వ్యవసాయోత్పత్తుల అమ్మకాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గూనురు శంకరరావు తెలిపారు.

యార్డులో చేపలు, మాంసం అమ్మకాలు చేపట్టినట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని మార్కెట్ యార్డులను రైతు బజారులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి పైడేశ్వరరావు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details