కూరగాయల అమ్మకాలను వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించాలన్న ఆదేశాలను నిరసిస్తూ విశాఖపట్నం జిల్లా చోడవరంలో కూరగాయల వ్యాపారులు అమ్మకాలు నిలిపివేసి బంద్ పాటించారు. మార్కెట్ యార్డులను రైతు బజార్లుగా మార్చాలన్న ప్రభుత్వం ఆదేశాలపై ఆగ్రహించారు. స్థానిక మార్కెట్ యార్డులో విక్రయాలు జరపాలని అధికారులు చెప్పడాన్ని తప్పుబట్టారు.
ఊరికి దూరంగా ఉన్న యార్డులో దుకాణాలు ఏర్పాటు చేస్తే కొనుగోలు దారులు రాక, అమ్మకాలు జరగక ఇబ్బందులు పడతామని కూరగాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు పట్టణంలో కూరగాయల అమ్మకాలు జరగకుండా తమ సంఘం ఆధ్వర్యంలో తీర్మానించి బంద్కు పిలుపునిచ్చారు.