విశాఖ జిల్లా అనకాపల్లిలో 'పలక' ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 4 వేల మందికి కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా వాటిని పేదలకు అందజేశారు. ఈ కష్టకాలంలో నిరుపేదలను ఆదుకునేందుకు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పలకా రవి, తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో 4 వేల మందికి కూరగాయల పంపిణీ - అనకాపల్లిలో పేదలకు కూరగాయల పంపిణీ
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, రోజువారీ కూలీలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు, బియ్యం అందజేస్తూ అండగా నిలుస్తున్నారు.
అనకాపల్లిలో 4 వేల మందికి కూరగాయలు పంపిణీ