పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా జీఎస్టీ చెల్లించడం ఆలస్యమైందని.. దానిపై వడ్డీని మాఫీ చేయాలని రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్‌కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(వీసీసీఐ) వినతిపత్రం సమర్పించింది. ఆలస్యంగా జీఎస్టీ చెల్లించిన వారు వడ్డీ చెల్లించాలని అధికారుల నుంచి నోటీసుల వచ్చిన తరుణంలో వీసీసీఐ స్పందించింది. దీనిపై వీసీసీఐ అధ్యక్షుడు వీరమోహన్ కమిషనర్‌ను కలిసి మాట్లాడారు. పోర్టల్‌లో సాంకేతిక సమస్యలతోపాటు.. వ్యాపారులకు జీఎస్టీపై సరైన అవగాహన లేకపోవటంతోనే చెల్లింపుల్లో జాప్యం జరిగినట్లు వివరించారు.
'సాంకేతిక సమస్యల వల్లే ఆలస్యమైంది.. వడ్డీ మాఫీ చేయండి'
పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా జీఎస్టీ చెల్లించడం ఆలస్యమైందని.. దానిపై వడ్డీని మాఫీ చేయాలని రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్‌కు వైజాగ్ పటం ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (వీసీసీఐ) వినతిపత్రం సమర్పించింది. దీనిపై వీసీసీఐ అధ్యక్షుడు వీరమోహన్ కమిషనర్‌ను కలిసి మాట్లాడారు.
వినతిపత్రం అందజేస్తున్న వీసీసీఐ అధ్యక్షుడు