ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూన్ 12న వీసీసీఐ అవార్డుల ప్రదానం - Vcci_Awards_

వ్యాపార, వాణిజ్య రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచినవారికి విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ తరఫున అవార్డులను ప్రదానం చేయనున్నట్టు సంస్థ సభ్యులు తెలిపారు.

జూన్ 12న వీసీసీఐ అవార్డుల కార్యక్రమం

By

Published : May 4, 2019, 8:13 PM IST

విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ

వ్యాపార, వాణిజ్య రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచినవారికి విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అవార్డులను ప్రదానం చేయనుంది. జూన్ 12న విశాఖలోని తాజ్ హోటల్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని వీసీసీఐ సభ్యులు తెలిపారు. వీసీసీఐ ఎక్స్ లెన్స్ అవార్డులుగా ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సీపుడ్, ఫార్మా, లాజిస్టిక్ రంగాల్లో నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఐదు వ్యాపార రంగాల్లో 14 కేటగిరిల్లో అవార్డులు ఇస్తామనీ... వివిధ కేటగిరీల పరిధిలో వచ్చిన దరఖాస్తులను ఐదుగురు సభ్యుల న్యాయనిర్ణేతల బృందం పరిశీలించి.. విజేతలను ఎంపిక చేస్తుందని తెలియజేశారు. జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ABOUT THE AUTHOR

...view details