కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలంటూ విశాఖలో ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టాయి. రైతులకు నష్టం చేకూర్చే చట్టాల రద్దు కోరుతూ దిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే వారిపై పోలీసులు దాడులకు పాల్పడటం అమానుషమని... ప్రజా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీలో రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలుపుతూ జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధానాలకు స్వస్తి పలికి రైతులతో సానుకూల చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ ప్రజాసంఘాల నిరసన - రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా విశాఖలో నిరసన
రైతులకు నష్టం చేకూర్చే చట్టాల రద్దు కోరుతూ... విశాఖ జిల్లాలో ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి. దిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతుగా జీవీఎంసీ గాంధీ పార్కులో ఆందోళన చేపట్టారు.
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ ప్రజాసంఘాల నిరసన