అనకాపల్లిలో అట్లు వేసి...
విశాఖ జిల్లా అనకాపల్లిలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో.. వైకాపా నేతలు వినూత్నంగా ప్రచారం చేశారు. 83వ వార్డు వైకాపా కార్పొరేటర్ అభ్యర్థిని జాజుల ప్రసన్న లక్ష్మి.. ప్రచారంలో భాగంగా, ఓ టిఫిన్ సెంటర్ వద్ద అట్లు వేసి ఓట్లు అభ్యర్థించారు.
కర్నూలులో..
కర్నూలు మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని గెలిపించాలని... తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఇంటి పన్ను పెరగకూడదంటే.. కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలన్నారు. తెదేపాను గెలిపిస్తే.. నీటి సమస్య పరిష్కారం కోసం రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ప్రకాశం జిల్లాలో..