Variety Flower Bouquet in Visakhapatnam: కొత్త సంవత్సర వేళ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీ. పూలు తెంపి గుచ్ఛంలా కట్టివ్వడం సాధారణమే.. కానీ విశాఖపట్నం రామ్‌నగర్‌లో ఓ నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. మొక్కకే గుచ్ఛంలా పూలు పూయించి బొకేలా తయారు చేశారు. ఒక్కో మొక్కపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సరైన పోషకాలు ఇస్తూ సిద్ధం చేశారు. మొక్కకు పూసిన పూలన్నీ గుచ్ఛంలా పైకి కనిపించేలా చేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు.
పుష్పగుచ్ఛం తయారీలో నయా ట్రెండ్ - విశాఖపట్నం రామ్‌నగర్‌లో ఓ నర్సరీ నిర్వాహకులు
Variety Flower Bouquet in Visakhapatnam: కొత్త సంవత్సరానికి మనం మన ఆత్మీయులకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతాము. మారుతున్న కాలానికి అనుగుణంగా తన ఆలోచనలను మార్చుకుని పూలను తెంచకుండా ట్రెండీగా పుష్పగుచ్ఛాన్ని తయారుచేసింది. నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను అంటున్నారు విశాఖపట్నం రామ్‌నగర్‌లో ఓ నర్సరీ నిర్వాహకులు.
variety flower boque