విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీలో రికార్డు స్థాయిలో ఇరవై రెండు లక్షలు సమకూరింది. కరోనా సమయం తర్వాత ఇదే ఒక్కరోజు అత్యధిక ఆదాయమని దేవస్థానం అధికారులు తెలిపారు. దర్శనం టిక్కెట్లు, ప్రసాదాల విక్రయం, భక్తుల తలనీలాల ద్వారా ఆదాయం సమకూరిందన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శని, ఆదివారాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు చెప్పారు. ఈ రెండు రోజులుగా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది.
కొవిడ్ తర్వాత.. రికార్డు స్థాయిలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆదాయం - sri varaha laxmi narasimhaswamy news
అన్లాక్ తర్వాత ఆలయాలు తెరచుకున్నాయి. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. దీంతో దేవస్థానాలకు ఆదాయం సమకూరుతోంది.
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం